Saturday, November 23, 2024

కాటమయ్య మహారాజుకు అభిషేకం..

ఎలిగేడు: మండలంలోని ధూళికట్ట గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్యుడు కాటమయ్య మహారాజుకు లేత ముంజ నీరుతో కొబ్బరికాయలు పసుపు కుంకుమతో అభిషేకం చేశారు. ప్రతి ఏటా ఏప్రిల్‌ నెలలో పౌర్ణమికి ముందు కాటమయ్య మహారాజును కొలిచి.. పండుతాళ్ల కల్లు గీస్తామని గౌడ కుల అధ్యక్షులు బూసారపు నర్సయ్య గౌడ్‌ తెలిపారు. అనంతరం గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లికి బోనం చేసి నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించారు. గౌడ కులస్తులందరిని చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సోదరి వెంకటేశం గౌడ్‌, సభ్యులు పడాల నరేష్‌గౌడ్‌, రంగు కొమురయ్య గౌడ్‌, పరశరాములుగౌడ్‌, భూమయ్యగౌడ్‌, అంకంపల్లి నరసయ్యగౌడ్‌, బాలసాని పరుశరాములు గౌడ్‌, భూసారపు శ్రీనివాస్‌ గౌడ్‌, భూసారపు స్వామి గౌడ్‌, పడాల తిరుపతి గౌడ్‌, సాయిలు గౌడ్‌, బాలసాని శ్రీనివాస్‌ గౌడ్‌,పడాల కిరణ్‌ గౌడ్‌, మేడి అరవింద్‌ గౌడ్‌, బత్తిని పరుశరాములు గౌడ్‌, బాలసాని పవన్‌ తేజ్‌ గౌడ్‌, అనిల్‌ గౌడ్‌, సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం మండల అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్‌ గౌడ్‌, యూత్‌ అధ్యక్షులు తిలక్‌ గౌడ్‌.. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement