కరీంనగర్ : నగరాన్ని పరిశుభ్రతతో అందంగా ఆకర్షనీయంగా క్లీన్ ఆండ్ గ్రీన్ కరీంనగర్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్, ఆర్‌అండ్‌బీ ఇంజనీంగ్ శాఖలతో పాటు గుత్తేదారులతో మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఐలాండ్ పనులపై జిల్లా కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ నగరాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన క్లీన్ అండ్ గ్రీన్ కరీంనగర్‌గా తీర్చిదిద్దాలని తెలిపారు. కమాన్ నుండి బద్దం ఎల్లారెడ్డి విగ్రహం వరకు పైపులైను, రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని తెలిపారు. అప్రోచ్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, మానేరు రివర్ ఫ్రంట్ పనుల ప్రగతిపై గుత్తేదారులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 31 నాటికి కేబుల్ బ్రిడ్జిని ప్రయాణానికి సిద్దం చేయాలని, మరుసటి రోజుకు లైటింగ్ పనులు పూర్తిచేయాలని సూచించారు. నగరంలో అక్రమణలకు అస్కారం లేకుండా చూడాలని, నూతనంగా ఏర్పాటు- చేసిన మార్కేట్‌లలో కూరగాయల విక్రయాలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. నగరంలో గీతాభవన్ చౌరస్తా, చోక్కారాపు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఐడిల్ లా నగరంలోని పద్మానగర్, కాపువాడ, హెచ్‌ఆర్ కే, సదాశివపల్లి డౌన్, సదాశివపల్లి టు వరంగల్ రోడ్, సిక్కువాడి మొదలగు ప్రాంతాలలో సరికొత్తగా ఐడిల్ ఏర్పాటుకు ప్రణాళికలను సిద్దం చేయాలని అదే విధంగా డిసబుల్ పార్కు నిర్మాణాలకు డీపీఆర్‌లను సిద్దం చేయాలని అన్నారు. నగరాన్ని బెంగుళారు వంటి మహనగరాలకు ధీటుగా అందంగా ఆకర్షనీయంగా పచ్చదనం పరిశుభ్రతలతో కూడిన కరీంనగర్‌గా తీర్చిదిద్దడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్, అదనపు కలెక్టర్లు జి.వి.శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, నగర వైస్ ఛైర్మెన్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఆర్డిఓ ఆనంద్ కుమార్, విద్యాశాఖాధికారి జనార్దన్ రావు, ఈఈ ఆర్‌అండ్‌బి సాంబశివరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, గుత్తేదారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement