పెద్దపల్లి, జనవరి 25 (ప్రభన్యూస్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో పేదల ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాసరి సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో కంటి పరీక్షల తీరును పరిశీలించిన అనంతరం అవసరం ఉన్న వారికి కంటి అద్దాలను ఎమ్మెల్యే స్వయంగా అందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అంధత్వం లేకుండా చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోలేని పేద ప్రజలకు ఉచితంగా పరీక్షలు, కంటి అద్దాలతోపాటు అవసరం ఉన్న వారికి కంటి శస్త్ర చికిత్సలు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని దాసరి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, జడ్పీటీ-సీ బండారి రామ్మూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, పీఏసీఎస్ ఛైర్మెన్‌లు దాసరి చంద్రారెడ్డి, మాదిరెడ్డి నరసింహా రెడ్డి, యూత్ మండల ధ్యక్షుడు కొయ్యడ విక్రం, సర్పంచ్ ఆడెపు వెంకటేష్, ఎంపీటీ-సీశ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షడు కొమురయ్య, తాడిశెట్టి శ్రీకాంత్, గాండ్ల సతీష్, సదయ్య, రమేష్, మల్లయ్య, శ్రీనివాస్, కుంట మల్లమ్మ, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement