ఓదెల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం ద్వారా నిరుపేద కుటుంబాలను ఆదుకుంటుందని ఓదెల ఎంపీపీ కునారపు రేణుకాదేవి పేర్కొన్నారు. ఓదెల ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు రూ. 45,00,720 విలువ గల కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి ఓ వరంలాంటిదన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 1లక్షా 116లను అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వ మాత్రమేనన్నారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, తెరాస యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, సర్పంచ్‌లు గుండేటి మధు యాదవ్, గుంటి శ్రీనివాస్, రమేష్, భాగ్యమ్మ, శ్రీనివాస్, ఎంపీటీ-సీలు బోడకుంట చిన్నస్వామి, నోముల పద్మావతి ఇంద్రారెడ్డి, జీల తిరుపతి, ఐరెడ్డి కిషన్ రెడ్డి, నాయకులు బోడకుంట నరేష్, తీర్థాల కుమారస్వామి, పోలోజు రమేష్, కుమార్, ఉపసర్పంచ్‌లు, తహసీల్దార్ రాంమోహన్, ఎంపీడీఓ సత్తయ్య, ఆర్‌ఐ వినయ్, అధికారులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement