ఎలిగేడు: తెలంగాణ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి పథకం వరంలాంటిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎలిగేడు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని 39 మంది లబ్ధిదారులకు రూ. 39,04,524ల విలువ గల కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పేద కుటుంబాలలోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి ద్వారా ఆదుకునేందుకు చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలు అమలు చేస్తున్నారన్నారు. తెరాస హయాంలోనే పేదలంతా సంతోషంగా ఉన్నారని, సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉందన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక రాజనర్సు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయ భాస్కర్‌రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసలు, ఉపసర్పంచ్లు, ఎంపీడీఓ, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement