సుల్తానాబాద్ : పేదింటి ఆడబిడ్డల కళ్యాణానికి ఇబ్బందులు ఎదురు కావద్దని, దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో మండలంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి 56 షాదీ ముబారక్ 6 చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అధికారం చేపట్టినప్పటినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని అందులో భాగంగానే ఎన్నికలలో ఈయని హామీలను సైతం అమలుపరుస్తూ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ స్థాయికి తీసుకువెళుతున్నారని అన్నారు. భారత దేశంలో ఎక్కడ లేని పథకాలు కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని, నిరుపేదల వివాహాలకు తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదురు పడద్దని గొప్ప సంకల్పంతో ఒక లక్ష 16 రూపాయలు కల్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ లకు అందిస్తున్నారని నేడు సుల్తానాబాద్ మండల కేంద్రంలో 62 మంది లబ్ధిదారులకు 62 లక్షల ఏడు వేల ఒక వంద 92 రూపాయలు అందించమన్నారు.
అలాగే ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు గృహాలు దెబ్బతిన్న వారికి 38 మందికి ఒక్కొక్కరికి 32 చొప్పున ఒక లక్ష ఇరవై ఒక్క వేల రూపాయలను అందించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రతి ఒక్క నిరు పేదకు న్యాయం జరిగే విధంగా పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు పోతున్నారని పేర్కొన్నారు. రైతులకు అడుగు మందు నుండి మొదలు కొంటే చివరి గింజ వరక కొనుగోలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కో సంక్షేమ పథకాన్ని అందిస్తూ ముందుకు పోతున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రం అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రవేశ పెడుతున్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని తమ రాష్ట్రాలలో ఇలాంటి సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దేశ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ అనంతరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, తెరాస మండల పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్చందర్ రావు, తాసిల్దార్ యాకన్న నాయక్, తాసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి, ఆర్ఐలు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.