జూలపల్లి : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికంగా భరోసా ఇస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జూలపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 24మంది లబ్ధిదారులకు రూ.24,02,784 విలువ గల కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరంగా మారిందన్నారు.
నిరుపేదల కళ్లల్లో ఆనందం చూసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, వైస్ ఎంపీపీ మొగురం రమేష్, పీఏసీఎస్ ఛైర్మెన్ వెంకటయ్య, ఏఎంసీ ఛైర్మెన్ చొక్కారెడ్డి, మండల కో ఆప్షన్ లాల్ మహమ్మద్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు నర్సింగ్ యాదవ్, తహసీల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ వేణుగోపాలరావు, మండల అధికారులు, మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.