సుల్తానాబాద్, (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ఆడబిడ్డ తల్లిదండ్రులు పెళ్లికి ఇబ్బందులు పడవద్దనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలంలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబాకర్ లబ్ధిదారులకు స్థానిక వైశ్య భవన్ లో చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశ పెడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చిన గొప్ప నేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రైతులకు సంక్షేమ పథకాలతో పాటు ఆడబిడ్డల పెళ్ళికి లక్ష 116 రూపాయలను అందిస్తూ.. వారు గర్భం దాల్చినప్పటి నుండి ప్రభుత్వమే వారిని కంటికి రెప్పలా కాపాడుతుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వసతులు పెరిగాయని ప్రస్తుతం ప్రైవేటు వైద్యశాల కన్నా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగిందని గర్భం దాల్చినప్పటి నుండి ప్రతి నెల ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ వారి ఇంటి వద్దనే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఆడబిడ్డల ప్రసవాలకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్టును అందిస్తూ ఆడబిడ్డకు 13000 మగ బిడ్డకు 12000 అందించి ఇంటిదగ్గర దింపుతున్నారని, అలాంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి దేనన్నారు.
చిన్నారులకు సైతం ప్రభుత్వ మే అన్ని పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తుందని పెన్షన్లు సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం అందినని ఏ ఒక్క పేదవారు ఆసుపత్రి ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆస్పత్రిలలో చికిత్సలు అందిస్తూ ఎల్ఓసిలు అందిస్తున్నారన్నారు. పేద ప్రజల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేద ప్రజల కళ్ళల్లో ఆనందం నింపడమే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు లక్ష్యమని భారతదేశం మొత్తం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పాలనను కోరు కొంటుందన్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పథకాలను ప్రవేశ పెట్టేందుకు బీఆర్ఎస్ అవతరించిందని ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు అండగా నిలవాలన్నారు. గతంలో పరిపాలించిన ఏ ఒక్కరూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని ప్రస్తుతం కలబొల్లి మాటలు చెప్పుతూ ప్రజల వద్దకు వస్తున్నారని అలాంటి వారి మాటలు నమ్మవద్దని ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. అనంతరం ఒక కోటి 30 లక్షల 15 వేల ఎనభై రూపాయల చెక్కులు 128 కళ్యాణ లక్ష్మి రెండు షాదీ ముబారక్ లను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, కే డి సి సి బి డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కాసర్ల అనంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, భారాస పార్టీ పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి బుర్ర మౌనిక శ్రీనివాస్ గౌడ్, తాసిల్దార్ యాకన్న గిరిదవారిలు స్వాతి వాణి లతోపాటు మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, భారాస పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.