కరీంనగర్ : పేదింటి అమ్మాయిల వివాహాలకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అందజేశారు. పట్టణంలోని 55 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను వారింటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. నిరుపేద ఆడపిల్లల వివాహాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా మారారని కికళ్యాణ లక్ష్మీ ద్వారా లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక చేయూత అందిస్తున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కల్యాణలక్ష్మి లాంటి పథకాలు లేవని, సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యాల సునీత రమేష్, బుర్ర శ్రీనివాస్, శ్రీగిరి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..