Tuesday, September 17, 2024

సంక్షేమంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరికలు… ఎమ్మెల్యే దాసరి

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తుండడంతో ప్రతిపక్షాల నాయకులు పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్ లో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరగా.. ఎమ్మెల్యే దాసరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీసీలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇలాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్, బిజెపి లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాష్ట్రంలో మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

బిఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ పూదరి చంద్రశేఖర్, రంగంపల్లి మాజీ వార్డు సభ్యులు పెర్క కనకయ్య, మాజీ వార్డు సభ్యులు మహమ్మద్ అజ్మత్, 9వ వార్డులో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మామిడిశెట్టి తిరుపతి, ఎండి మహమ్మద్, మామిడిపల్లి కనకయ్య, పెరక రవి ,ఎండి యాకూబ్, ఎండి తాజ్, పెందుర్తి వెంకన్న, బొమ్మగోని అరవింద్, ఎండి ముబారక్, ఎండి అంకుష్, ఎండి హైదర్ అలీ, గడ్డం శంకర్, పెరిక లింగయ్య లతోపాటు శివ పల్లి గ్రామం నుండి కాంగ్రెస్ యూత్ నాయకులు పొన్నాల మనోజ్, పొన్నాల యశ్వంత్, పొన్నాల అజయ్, పొన్నాల సజన్, పొన్నాల సాగర్, పొన్నాల అనిల్, గాజుల నగేష్, ఆసంపల్లి హరీష్, అరికెళ్ల ప్రశాంత్, బొంకురి వంశీ లతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు గులాబీ దండు లో చేరారు.


ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జడల సురేందర్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, కొలిపాక శ్రీనివాస్, గాదె మాధవి, సాబీర్ ఖాన్, పెంచాల రమ శ్రీధర్, పైడ పద్మ రవికుమార్, కొమిరిశెట్టి శ్రీకాంత్, ఖదీర్ ఖాన్, గొట్ట మహేష్, దేవనంది దేవరాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గండు రంగయ్య, వైద శ్రీనివాస్, బంక అశోక్, కందుకూరి అనిల్, కుక్క కనకరాజు, వెన్నం రవీందర్, పల్లె మధు, కాశిపాక వాసు, ఎండి అస్గర్, ఉప్పు రమేష్, ఎండి రఉఫ్, జాకీర్ హుస్సేన్, గొట్టేముక్కుల శ్రీనివాస్, కుంభం సంతోష్, దేవనంది నవీన్, బొంకూరి అఖిల్, సముద్రాల రాజ్ కుమార్ గౌడ్, అడప సంతోష్, కుక్క మనోజ్ లతోపాటు సుల్తానాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్ట మహేష్, ఎండి రఫీక్, ఏకశిలా శ్రీనివాస్, వహీద్, రమాకాంత్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement