Sunday, November 17, 2024

జీలకుంటలో పాజిటివ్‌ కేసులు..

ఓదెల: మండలంలోని జీలకుంట గ్రామంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పదుల సంఖ్యలో నమోదు కావడంతో తక్షణమే నివారణ చర్యలు చేపట్టారు. పాజిటివ్‌ కేసులు నమోదైన వ్యక్తుల ఇళ్ల చుట్టు పక్కల ప్రాంతంలో హైపోక్లోరైట్‌ పిచికారి చేయించినట్లు సర్పంచ్‌ పత్తి మాలతి సమ్మిరెడ్డి తెలిపారు. స్థానిక వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. పాజిటివ్‌ వృద్ధుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ వారికి కావాల్సిన ఆరోగ్య సేవలందిస్తున్నారు. కోవిడ్‌ నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. సర్పంచ్‌తో పాటు పాలకవర్గం, ఆరోగ్య బృందం అందిస్తున్న సేవలను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement