Thursday, November 21, 2024

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధన కోసం పాటు- పడాలి

వేములవాడ: భారతదేశ మాజీ ఉప ప్రధాని, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన బాబు జగ్జివన్‌రామ్‌ 114వ జయంతి వేడుకలను వేములవాడ మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌ సుందర్‌ రావు బాబు జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగ్జీవన్‌ రామ్‌ కేంద్ర మంత్రిగా, మాజీ ఉప ప్రధానిగా ఆయన సేవలను గుర్తు చేశారు. జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు-పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement