కరీంనగర్ : ప్రపంచంలోని ఆర్య వైశ్యులను ఒక్క తాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఐవీఎఫ్ ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి రాజేందర్ పేర్కొన్నారు. ఐవీఎఫ్ 9వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఉత్తర్ ప్రదేశ్‌లోని మధురలో గల వ్రిందావణంలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా పాల్గొన్న రాజేందర్ మాట్లాడుతూ… 9 సంవత్సరాల క్రితం స్వర్గీయ రాందాస్ అగర్వాల్ స్థాపించిన ఐవీఎఫ్ అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు.
ఐవీఎఫ్ స్థాపించిన 9 ఏళ్లుగా కరీంనగర్ జిల్లాలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, వేల మందికి ఆపదలో రక్తదానం చేశామన్నారు. కరోనా సమయంలో లక్షల మందికి యువజన విభాగం ఆధ్వర్యంలో ఉచితంగా భోజనాలు అందించామన్నారు. ఇకముందు కూడా అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం శాఖ అభివృద్ధి ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, బచ్చు శ్రీనివాస్, కూర నాగరాజు, రఘు గంగిషెట్టి, జిన్నం వేణు, ఐవీఎఫ్ నాయకులు హాజరయ్యారు. అలాగే రాజేందర్‌తోపాటు కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షుడు సంతోష్ కుమార్, జనగాం జిల్లా అధ్యక్షుడు బిజ్జల నవీన్, కరీంనగర్ జిల్లా యువజన నాయకుడు తోడుపునురి హరిప్రసాద్, హైదరాబాద్ యువజన నాయకుడు కొలుపురి నరేష్‌లతో పాటు పాల్గొన్నారు.