జిల్లా ప్రభుత్వ ప్రధాన అసుపత్రిలో నిర్వహించిన సదరం శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో శారీరక, మానసిక, కంటి సమస్యలతో పాటు ఇతర లోపాలతో బాధపడే వికలాంగులకు వారి లోపాన్ని నిర్దారిస్తూ జారీ చెసే సర్టిఫికెట్ల జారీలో ఎటువంటి అలస్యం జరగకుండా చూడాలన్నారు.
ఇప్పటి వరకు సదరం క్యాంపుకు హజరై సర్టిఫికెట్లు అందని వారికి, రెన్యూవల్ సర్టిఫికెట్ల జారి మొదలైన వాటిని వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై జరిగే సదరం క్యాంపును 150 మంది వికలాంగుల కొరకు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, ఆదేవిధంగా క్యాంపుకు హజరైన వారికి ఇబ్బందులు కలుగకుండా కనీస మౌళిక వసతులను కల్పించాలని సూచించారు. అనంతరం క్యాంపును, రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ జి. వీరారెడ్డి, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.