Friday, November 22, 2024

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ శోచనీయం..

రామగిరి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం శోచనీయమని ఐఎన్‌టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు నర్సింహరెడ్డి పేర్కొన్నారు. ఏఎల్‌పీ గనిలో ఆర్జీ3 ఉపాధ్యక్షుడు కోట రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో 127 ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసిందని, ప్రజలు, రైతులు, కార్మిక వర్గానికి అండగా నిలిచిందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్న వర్గాలను మోసం చేసేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్‌ శక్తులకు అమ్ముకుంటూ పోతే భద్రత కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పక్షాన ఐఎన్‌టీయూసీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో రామగుండం రీజియన్‌ కోఆర్డినేటర్‌ సదానందం, బ్రాంచి కార్యదర్శులు గడ్డం తిరుపతి యాదవ్‌, ఇస్తారీ రాజయ్య, బ్రాంచి కోశాధికారి డి మంగయ్య, ఏఎల్‌పీ పిట్‌ కార్యదర్శులు మందల కొమురయ్య, ఓసీపీ1 వెంకటస్వామి, ముత్యం తిరుపతి, లచ్చయ్య, కోల అనిల్‌, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement