రాజన్న సిరిసిల్ల : రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని రైతు వేదికలకు త్వరలోనే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బొప్పపూర్‌లో నిర్మించిన రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఆలోచించని విదంగా రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా రైతు వేదికలు ఏసీలతో నిర్మాణం జరగలేదన్న మంత్రి బొప్పపూర్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రైతులు ఏసీల్లో కూర్చొని మాట్లాడుకునే రోజులు వచ్చాయన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని కేంద్రానికి సంబంధించిన ఎఫ్‌సీఐ చెప్తుందన్నారు. ఈ బడ్జెట్‌లో రూ. 5,250 కోట్ల రుణ మాఫీ చేసినట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట తప్పకుండ సమగ్రమైన ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత రైతులకు కరువు అనేది రాకుండా అప్పర్ మానేరు నీటితో కళకళలాడే విదంగా చేస్తామన్నారు. అప్పర్ మానేరు ద్వారా పంటలకు నీరందిస్తామని.. అతి త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement