Friday, November 22, 2024

ఇంటెలిజెన్స్ సీఐ వేధింపులు.. బొడిగె శ్యామ్ ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా… చొప్పదండి మండలంలోని భూపాలపట్నం గ్రామంలో బొడిగే శ్యామ్ అలియాస్ సాంబయ్య సూసైడ్ చేసుకున్నాడు. సాంబయ్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ సి.ఐ గోపీ కారణం అంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఓ భూమి విషయంలో సి.ఐ గోపీ బెదిరించాడంటూ మృతుడు నోట్ లో పేర్కొన్నాడు. చొప్పదండి మండలం భూపాలపట్నంలో ఇరవై గుంటల భూమిని ఇంటలిజెన్స్ సిఐ కొన్నాడు.

ఇరవై గుంటల భూమిని చొప్పదండికి చెందిన శ్యామ్ అమ్మించాడు. ఇరవై గుంట‌ల‌ భూమిని సీఐ యాభై లక్షలకు కొన్నాడు. కొనేటప్పుడు పది లక్షల లాభం వస్తదని శ్యామ్ చెప్పాడు. రియల్ ఎస్టేట్ భూం తగ్గిపోవడంతో ప్లాట్లు అమ్ముడుపోలేదు. దీంతో పది లక్షల లాభం డబ్బులు ఇయ్యాలని శ్యామ్ ను సీఐ వేధించాడు. ఇప్పటికే శ్యాం ఆరు లక్షలు ఇచ్చాడు. మిగితా నాలుగు లక్షల కోసం వేధింపులకు గురిచేశాడు. వేధింపులు, పోన్ లో టార్చర్ ఎక్కువ కావడంతో నిన్న రాత్రి శ్యామ్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement