Tuesday, September 17, 2024

సమస్యల పరిష్కారానికి గ్రామసభలు

చిగురుమామిడి: మండలంలోని ఇందుర్తి గ్రామంలో సర్పంచ్‌ అందె స్వరూప స్వామి అధ్యక్షతన గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ నెలకొకసారి సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు నెలలో జరిగిన అభివృద్ధి పనులు సిసి రోడ్లు డ్రైనేజీ పనులను వార్డుల వారీగా వివరించారు. ఆదాయం, నిల్వ ఖర్చులను చదివి గ్రామస్తులకు కార్యదర్శి వివరించారు. అభివృద్ధి పనులపై గ్రామస్తులతో సర్పంచ్‌ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ తోట సతీష్‌, వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement