రెండు రోజులుగా పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్పపీడన ద్రోని ప్రభావంతో 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నీటితో కలకలాడుతున్నాయి. భారీ వర్షం కురవడంతో రంగంపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వేకువజాము నుండి పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ ఎస్సై రాజేష్ తో పాటు సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement