చట్టాన్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ బాలుసాని మోహన్ తెలియజేశారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సరఫరా చేసినా, విక్రయించినా కేసులు తప్పవన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని, ప్రజలు సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఏసీపీ నరేందర్ కు ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, విద్యాసాగర్, ముత్తులింగం, సబ్ ఇన్స్పెక్టర్లు ఉపేందర్, రాజేష్, రాజ వర్ధన్ లతో పాటు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.