Friday, November 22, 2024

Peddapalli | మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే.. ట్రాఫిక్ సిఐ అనిల్

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదని పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ తెలియజేశారు. శనివారం జిల్లా కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… శుక్రవారం మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి జరిమానాలతో పాటు ఒకరికి రెండు రోజులపాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశించారన్నారు.

ఇందులో భాగంగా కమాన్పూర్ కు చెందిన ఇందారపు రమేష్ ను రెండు రోజులపాటు ట్రాఫిక్ విధుల్లో ఉపయోగించుకుంటున్నట్లు తెలియజేశారు. ఇకపై తరచూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని ధ్రువీకరణ పత్రాలు సరిగా లేకపోతే జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి వాహన చోదకులతో పాటు అభంశుభం తెలియని వారు మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు సహదేవ సింగ్, రవితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement