Friday, November 22, 2024

Peddapalli: కాంగ్రెస్ ను నమ్మితే మూడు గంటల కరెంటే… ఎమ్మెల్యే దాసరి

మాయమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. గడపగడపకు ప్రచారంలో భాగంగా మంగళవారం పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ… గత పాలకుల హయాంలో పెద్దపల్లి నియోజకవర్గం వివక్షకు గురైందని, గత తొమ్మిదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారన్నారు. గతంలో ఏ పాలకులు చేయలేని అభివృద్ధిని చేసి చూపామన్నారు.

అధికారంలో ఉన్న నాడు ఏమి చేయలేని దద్దమ్మలు ఎన్నికల్లో పొందేందుకు అసత్యపు ప్రచారాలు చేస్తారన్నారు పెద్దపల్లి ప్రజలు దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదని, మూడోసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా మూడోసారి అవకాశం ఇవ్వాలని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీములను దొంగ ప్రచారం చేస్తుందని, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దమ్ముంటే రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, సర్పంచ్ సదయ్య, మార్కు లక్ష్మణ్ తో పాటు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement