Tuesday, November 26, 2024

మోసపోతే.. మరోసారి గోస పడతాం.. కాంగ్రెస్‌ను నమ్మితే.. మళ్లీ పాత రోజులే.. ఎమ్మెల్యే దాసరి

కాల్వశ్రీరాంపూర్‌, జులై 22 (ప్రభన్యూస్‌): కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే.. మరోసారి గోస పడక తప్పదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతన్న.. మేలుకో.. సమావేశానికి ఎమ్మెల్యే దాసరి హాజరై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రైతులకు 24గంటల ఉచిత కరెంటు సరఫరా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అనంతరం దాసరి మాట్లాడుతూ… సమైక్య పాలనలో రైతన్నలు పడిన ఇబ్బందులు, కష్టాలు మరవలేమన్నారు. ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అన్నదాత ఎంతో సంతోషంగా ఉన్నాడన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి మూడు పంటల సాగుకు ఊతమిచ్చిన కేసీఆర్‌ కావాలో.. ఆనాడు రైతు ఆత్మహత్యలకు కారణమైన, ఈనాడు రైతులకు 24 గంట కరంటు వద్దు.. మూడు గంటలు సరిపోతుందని కపట ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్‌ కావాలో రైతన్నలే తేల్చుకోవాలని కోరారు.

ఈకార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, రైతు సవిుతి మండల కో ఆర్డినేటర్‌ నిదానపురం దేవయ్య, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, పీఏసీఎస్‌ ఛైర్మెన్‌లు చదువు రామచంద్రారెడ్డి, గజవెల్లి పురుషోత్తం, వైస్‌ ఎంపీపీ జూకంటి శిరీష అనిల్‌, మాజీ మార్కెట్‌ ఛైర్మెన్‌ రామచంద్రారెడ్డి, మండల కోఆప్షన్‌ ఇబ్రహీం, కన్వీనర్‌లు నరెడ్ల సదానందం, గొడుగు మల్లేష్‌, బోయిని సదయ్య, సర్పంచ్‌లు ఆడెపు శ్రీదేవి రాజు, నరేందర్‌, సంగీత మహేందర్‌, రజిత తిరుపతి, ఎంపీటీసీలు సువర్ణ చంద్రు, కౌసల్య శంకర్‌, ఉపసర్పంచ్‌ లు సుదాటి కరుణాకర్‌, వడ్లూరి సాగర్‌, గ్రామ శాఖ అధ్యక్షులు సారంగపాణి, సాగర్‌ రెడ్డి, బంధారపు మల్లయ్య, రాయమల్లు, రైతు సమితి గ్రామ కో ఆర్డినేటర్‌లు పులి రాంరెడ్డి, కొట్టే సంపత్‌, అల్లం రాజేందర్‌, సర్పంచ్‌లు బండ రవిందర్‌ రెడ్డి, కొంకటి మల్లారెడ్డి, గోనె శ్యామ్‌, దేవేందర్‌రావు, నాగార్జున్‌ రావు, బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement