హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఆర్ వి. కర్ణన్ పేర్కొన్నారు.
శనివారం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల తో మాట్లాడారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఓటర్లు నడుచుకోవాలని సూచించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు.