Friday, November 22, 2024

ప్రకృతిని శాశించే శక్తి మానవులకు లేదు : ఎమ్మెల్యే ఈటల

పెద్దపల్లిరూరల్ : ప్రకృతిని శాశించే శక్తి మానవులకు లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటెల మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద భీభత్సం విదేశీ కుట్ర అని సీఎం కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.

ప్రకృతిని శాశించి ప్రజలకు మేలు చేసే శక్తి అమ్మవారికే ఉందని పేర్కొన్నారు. ప్రకృతి విలయతాండవంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక వరదలవల్ల గ్రామాలు నీట మునిగి ప్రజలు తిండికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల నుండి ప్రజలను కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. మస్త్య పారిశ్రామిక సహాకార సంఘం పెద్దపల్లి అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య అధ్యక్షతన కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్, సంధ్యచిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పిటిసి గంట రాములు, మాజీ ఎంపీపీలు సి. సత్యనారాయణ రెడ్డి, వేముల రాంమూర్తి, కొలిపాక సంపత్, వివిధ పార్టీ నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈటెలను గజమాలతో ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement