Tuesday, November 19, 2024

TG : ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి… కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి రోడ్డు వద్ద ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్, ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు, వైద్య పరీక్షల నిర్వహణ, రిఫరల్ కేసులు, అవుట్ పేషంట్ వంటి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ… అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రిఫర్ చేసిన కేసులను ఫాలో అప్ చేయాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద వచ్చే మహిళలకు అవసరమైన అన్ని పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.
ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. గర్భిణీ మహిళల ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్ 100శాతం పూర్తి చేయాలన్నారు. ఔట్ పేషంట్ రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట వైద్య అధికారి డాక్టర్ స్వప్న, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement