తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పెద్దపల్లి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 11న పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని ఒకటవ పోలీస్ స్టేషన్ అంతర్గాం పోలీస్ స్టేషన్ల నూతన భవనాలతో పాటు పోలీస్ గెస్ట్ హౌస్ ను హోంమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరవుతారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement