పెద్దపల్లి, (ప్రభన్యూస్): ద్విచక్ర వాహనదారులకు హెల్మట్ రక్షణ కవచమని పెద్దపల్లి డీసీపీ అఖిల్ మహజన్ పేర్కొన్నారు. శుక్రవారం వాహనదారులకు హెల్మట్ ధారణపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో ప్రారంభమైన ర్యాలీ జెండా చౌరస్తా, మజీద్, అమర్‌నగర్, ప్రగతి నగర్‌ల మీదుగా బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. వాహనదారుడితోపాటు వెనక కూర్చునే వారు సైతం హెల్మట్ ధరించాలని, ప్రమాద సమయంలో ప్రాణ హాని జరగకుండా హెల్మట్ కాపాడుతుందన్నారు.
రవాణా శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు పెద్దపల్లి డీసీపీ. ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు తరచూ నిర్వహిస్తామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్‌కుమార్, అనిల్‌కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు రాజేశ్, మహేందర్, ఉపేందర్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.