Sunday, November 24, 2024

వేములవాడలో భారీ వర్షం..

మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వేములవాడ పట్టణంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన‌ట్లు అధికారులు తెలిపారు. వరద నీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, మున్సిపల్ , రెవిన్యూ అధికారులు సూచనలు జారీ చేశారు. వేములవాడ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పట్టణానికి విద్యుత్ సరఫరా చేసే సబ్ స్టేషన్ లోకి వరద నీరు వ‌చ్చి చేరింది. దీంతో వేములవాడ పట్టణంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. న్యూ అర్బన్ కాలనీ, చెక్కపల్లి రహదారిలోని రాజీవ్ నగర్, బుడిగ జంగాల కాలనీ, ఇతర లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు భారీగా వ‌చ్చి చేరింది. గుడి చెరువులో ఇనప వస్తువులను సేకరించేందుకు వెళ్లి వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ కు చెందిన జనగామ నాగరాజు (22) యువకుడు దుర్మరణం చెందాడు. గణేష్ మండపాల ఇనప జాలిలలో చిక్కుకొని మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పట్టణానికి సంబంధించిన పలు రాకపోకల నిలుపుదల చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement