Tuesday, November 26, 2024

గుండె నిండా గులాబీ జెండా.. మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణలోని ప్రతి కార్యకర్త గుండెనిండా గులాబీ జెండా నిలువై ఉందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు.. కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సుమారు 3వేల‌ మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ లోని మంత్రి నివాసంలో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే లుసుంకే రవిశంకర్ రసమయి బాలకిషన్, జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావులతో ఈనెల 25న నిర్వహించే నియోజకవర్గ సమావేశం గురించి మంత్రి గంగుల కమలాకర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే సమావేశాలను విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలోని ప్రతి (వార్డు) ఊరిలో ఇప్పటికే జండా గద్దెల నిర్మాణం పూర్తయిందని, నిర్మాణం కానీ చోట గద్దెల నిర్మాణం చేపట్టి.. ఈనెల 25న ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో, గ్రామాల్లో అయితే గ్రామ శాఖ ఆధ్వర్యంలో గులాబీ జెండా ఎగురవేసి పార్టీ సమావేశానికి ముఖ్య కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 3వేల‌ నుండి 5వేల మంది ముఖ్య కార్యకర్తలు హాజరై సమావేశాలను విజయవంతం చేయాలన్నారు. ఆయా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో జడ్పిటిసి, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు సమన్వయంతో సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో రాజశ్రీ గార్డెన్, మానకొండూర్ నియోజకవర్గం సుప్రీం ఫంక్షన్ హాల్ చొప్పదండి నియోజకవర్గం సమావేశం గంగాధర మండల కేంద్రంలోని బీఏఎస్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశాలు ఉదయం 10 నుండి 1 గంటల వరకు జరుగుతాయని. భోజన విరామం తర్వాత కూడా జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి చొప్పదండి మానకొండూరు ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్ రసమయి బాలకిషన్ లతోపాటు జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement