ముత్తారం: పోషన్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. రక్తహీనత లేకుండా, ఆరోగ్యంగా ఉండేలా పౌష్టికాహారం తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement