Sunday, September 8, 2024

వ్యాయామంతో ఆరోగ్యం .. సీపీ చంద్రశేఖర్ రెడ్డి

ప్రతినిత్యం వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు పెద్దపెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పెద్దపల్లి మున్సిపల్ సహకారంతో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వ్యాయామం, యోగా చేయడం అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్, ఎస్సై రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement