గోదావరిఖని : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ హాజరై గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ ప్రదర్శనలను తిలకించారు. ఈసందర్బంగా సీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలని, వ్యాయామం చేయడం చాలా ముఖ్యమన్నారు. మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వర్తించేందుకు ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరన్నారు. అలాగే సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, ఫిట్నెస్ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అలవరుచుకోవాలని, రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్, ఆర్ఐలు శ్రీధర్, విష్ణు ప్రసాద్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement