పెద్దపల్లిరూరల్: బీమా పాలసీలపై జీఎస్టీ నిలిపివేయాలని, ఎల్ఐసీ పాలసీలకు బోనస్ రేటు పెంచాలని, గ్రాడ్యూటీని పెంచాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసీ ఏజెంట్లు లియాఫీ ఆధ్వర్యంలో ఒకరోజు ధర్నా నిర్వహించారు. మంగళవారం స్థానిక ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఏజెంట్లు సమస్యలపై నినాదాలు చేశారు. గ్రూప్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్‌ను పెంచాలని, క్లబ్ మెంబర్ ఏజెంట్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను వారి పిల్లలకు కూడా వర్తింపజేయాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ నాన్ క్లబ్ ఏజెంట్లకు ఇవ్వాలని, పెంచిన ఏజెంట్ల కమీషన్ వెంటనే అమలు చేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్‌లో జీవితాంం వర్తింపజేయాలన్నారు. పాలసీదారులకు లోన్ వడ్డీ రేట్లు తగ్గించాలని, ఎల్ఐసీలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ఐపీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో అధ్యక్షుడు సాగి ప్రసాద్‌రావు, ప్రధాన కార్యదర్శి సుభాష్ తివారీ, కోశాధికారి సముద్రాల మల్లయ్య గౌడ్, ఎల్ఐసీ ఏజెంట్లు, లియాపి యూనియన్ నాయకులు రాజేందర్‌సింగ్, భాస్కర్, నవీన్, గుండ్రాతి శ్రీనివాస్, పొగాకుల సదయ్య, నర్సింహరెడ్డి, దొడ్ల లింగమూర్తి, రమణారెడ్డి, మల్లయ్య, వెంకటేశ్వర్లు, ఓఎలు, ప్రభాకర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, పోసాని శ్రీనివాస్, చంద్రమౌళిలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement