పెద్దపల్లి : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించారు.
ఆదివారం గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పెద్దపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ట్రినిటీ ఫార్మాస్యూటికల్ కళాశాల, గాయత్రి డిగ్రీ కళాశాలలను సందర్శించి పరీక్ష నిర్వహణా తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరీక్షా కేంద్రాల్లో అధికారులు తీసుకున్న బయో మెట్రిక్ హాజరు నమోదును, పరీక్ష నిర్వహణ తీరును, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. మొత్తం 16 పరీక్షా కేంద్రాల్లో 6067 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 1384 మంది గైర్హాజరు కాగా, 4683 మంది హాజరైనారని, 77.19 శాతం హాజరు నమోదు అయినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, పెద్దపల్లి డీసీపీ రూపేష్ లు పరిశీలించారు. బందోబస్తులో పెద్దపల్లి ఏసీపీలు సారంగపాణి, గిరిప్రసాద్, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, సతీష్, లక్ష్మీనారాయణ, రమేష్ ఎస్సైలు రాజేష్, ఉపేందర్, శ్రీనివాస్, మహేందర్, వెంకటకృష్ణ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం…
Advertisement
తాజా వార్తలు
Advertisement