Tuesday, November 19, 2024

ఘనంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు.. తేలుకుంటలో 75 అడుగుల జాతీయ జెండా

భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు జూలపల్లి మండలం తేలుకుంటలో జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ 75 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి లక్ష్మణ్ మాట్లాడుతూ… భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన స్వగ్రామమైన తేలుకుంట గ్రామంలో 75 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని
ఎగురవేయడం జరిగిందని, అలాగే ఎందరో మహనీయులు వారి జీవితాలను ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సాధించడం జరిగిందన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా తేలుకుంట గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, అందులో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించడం జరిగిందన్నారు. సైనికులు దేశం కోసం చేస్తున్న సేవను కొనియాడారు. స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల, కాకతీయ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు భారతదేశం పటం ఆకారంలో మానవహారం, 150 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి రాంగోపాల్ రెడ్డి, ఎంపిటిసి కత్తర్ల శ్రీనివాస్, సర్పంచ్ సొల్లు పద్మశామ్, ఉపసర్పంచ్ చొప్పరి నర్సింగం, సర్పంచులు నర్సింగ్ యాదవ్, కొత్త శకుంతల రవి, తొంటి పద్మ బుచ్చయ్య, ఎంపిటిసిలు దండే వెంకటేశ్వర్లు, తమ్మడవేణి మల్లేశం, సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు చిగురు రవీందర్ రెడ్డి, ఎంపీడీవో వేణుగోపాలరావు, తాసిల్దార్ అబూబకర్, ఎంపిఓ కిరణ్, ఎంఈఓ కవిత, ఏపీఓ సదానందం, ఏపీఎం తులసి మాత, పంచాయతీ కార్యదర్శి కిరణ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చాతల్ల కాంతయ్య, మండల కన్వీనర్ కుంట రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచులు మెండ పోచన్న, గొడిసెల రవి, సూరిశెట్టి రాజేశం, ఉప సర్పంచ్ కొప్పుల మహేష్, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చొప్పరి శేఖర్, గడ్డం రాజేశ్వర్ రెడ్డి, కందుకూరి వెంకన్న, రేశవేని మల్లయ్య, టిఆర్ఎస్ నాయకులు తొగరు శ్రీనివాస్, చిప్ప రమేష్, పిల్లి భూమయ్య, తీగల వీరేశం, కోటగిరి శంకరయ్య, బొద్దుల వెంకటేశం, శ్యామ్, జెట్టి సతీష్, సంకెళ్ల లక్ష్మీ నరసయ్య, చిప్ప శ్రీకాంత్ మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement