Friday, November 22, 2024

వరద బాధితులకు ప్రభుత్వ చేయూత..

ఎలిగేడు,(ప్రభన్యూస్‌): భారీ వర్షాలతో నష్టపోయిన వరద బాధితులకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎలిగేడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మండలంలోని 53 మందికి ఒక్కొక్కరికి రూ. 3200 చొప్పున రూ. 1 లక్షా 69 వేల 600 ఆర్థిక సహాయం ఎమ్మెల్యే అందజెశారు. అనంతరం ఐకేపీ సీఏలు, మహిళా సంఘాల సభ్యులకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాలతో ఇల్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

తక్షణ సహాయంగా ఆర్థిక సాయం చేసిందన్నారు. అలాగే గ్రామాల్లో వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని కోరారు. తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు మహిళా సంఘాలు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్‌ రావు, జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ మండిగ రేణుక రాజనర్సు, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మెన్‌ విజయ భాస్కర్‌ రెడ్డి, గ్రామాల సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement