కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 30 (ప్రభన్యూస్): తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ. కోటి 33 లక్షల నిధులతో ఓపెన్ షెడ్డు గోదాంకు, రూ.56 లక్షల నిధులతో నిర్మాణం చేపడుతున్న వ్యవసాయ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మార్కెట్లను అభివృద్ధి చేశామన్నారు. సబ్ మార్కెట్‌గా ఉన్న కాల్వ శ్రీరాంపూర్ మార్కెట్ యార్డ్ ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్ ఆవరణలో ఉన్న ప్రదేశాన్ని చదును చేసి రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్, పెద్దపల్లి, శ్రీరాంపూర్, జూలపల్లి, మార్కెట్లతోపాటు సబ్ మార్కెట్లో ఉన్న పొత్కపల్లి, ఎలిగేడు, మార్కెట్లను సైతం కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచామన్నారు.
గత పాలకుల హయాంలో మార్కెట్ల వైపు కన్నెత్తి చూడలేదని, వాటి అభివృద్ధి కోసం ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి ఓటు వేసి స్థానిక రైతాంగం ఆశీర్వదించాలని కోరారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు, సింగిల్ విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవల్లి పురుషోత్తం, మాజీ మార్కెట్ చైర్మన్ కొట్టే సుజాత రవీందర్, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, ఎంపీటీసీ మాదాసి సువర్ణ చందు, సర్పంచులు బండ రవీందర్ రెడ్డి, గోనె శ్యామ్, మాజీ మార్కెట్ చైర్మన్ జిన్నా రామచంద్రారెడ్డి, ఉప సర్పంచ్ సదాటి కరుణాకర్ రావు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సదాశివరెడ్డి, యువత నాయకులు కూకట్ల నవీన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సరోజన, మాజీ మార్కెట్ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.