Thursday, November 21, 2024

మెరుగైన పాలనే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే దాసరి

జూలపల్లి, జూలై 7 (ప్రభన్యూస్‌): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన పాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జూలపల్లి మండలం కీచులాటపల్లి గ్రామంలో ఎంజీ ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ నిధులు రూ. 20లక్షలతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ రూ. 25లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమం త్రి కేసీఆర్‌ పాలనలో గ్రామాలని అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుతో పాలన సులభతరమవుతుందని, ప్రతి గ్రామపంచాయతీకి పక్కా భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్ధశ వచ్చిందన్నారు. ప్రతి గ్రామంలో రవాణా వ్యవస్థ మెరుగు పడిందన్నారు. మౌళిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తూ.. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు.


ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్‌ రఘువీర్‌ సింగ్‌, ఎంపీపీ రమాదేవి రాంగోపాల్‌ రెడ్డి, మండల పార్టీ గౌరవాధ్యక్షుడు కంది చొక్కారెడ్డి, వైస్‌ ఎంపీపీ మొగురం రమేష్‌, అనుబంధ సంఘాల అధ్యక్షులు తమ్మడవేని మల్లేశం, కత్తెర్ల శ్రీనివాస్‌, కరాటే లక్ష్మణ్‌, సర్పంచ్‌ శకుంతల రవి, ఉప సర్పంచ్‌ వనిత సతీష్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు మెండే ఓదెలు, నాయకులు మెండే లచ్చయ్య, మెండే తిరుపతి, శ్రీకాంత్‌, మల్లేష్‌, భూమయ్య, పడాల తిరుపతి, మల్లయ్య, పోచాలు, ఐలయ్య, సర్పంచ్‌లు సంతోష్‌రావు, జ్యోతి బసు, ఉపసర్పంచ్‌ అడువాల తిరుపతి, మాజీ ఎంపీటీసీ ఎర్రోళ్ల రాములు, బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement