Tuesday, November 19, 2024

TS : దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్‌

మేడిపల్లి, ఏప్రిల్‌ 27 (ప్రభన్యూస్‌): దేవుడు గుడిలో ఉండాలని… భక్తి గుండెల్లో ఉండాలని.. రాముడి పేరు చెప్పి ఓట్లు అడిగే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. శనివారం వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్‌ మీటింగ్ నిర్వ‌హించారు.

- Advertisement -

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మనందరికీ కొండంత అండగా ఉంటారన్నారు. రాముడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. దేవుడి ఫోటో చూపించి ఓట్లు- అడిగే వారికి వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బుద్ధి చెబుదామన్నారు. మాట తప్పని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 48 గంటలోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అమలు చేశామని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే ఆరు హామీల్లో 5 హామీలను ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. పార్లమెంట్‌- ఎన్నికలు పూర్తయిన తరువాత నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు.

రూ. 4వేల పింఛన్‌, మహాలక్ష్మి పథకం కింద మహిళా సోదరీమణులకు 2500 అందజేస్తామన్నారు. హామీలు అమలు చేయలేదని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు కొంచమైనా బుద్ధి ఉండాలన్నారు. 2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 65,000 కోట్ల అప్పును చూపించగా, పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పుచేసి ఖజానాను ఖాళీ చేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే.. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే హస్తం గుర్తుపై ఓటు- వేసి వెలిచాల రాజేందర్‌రావును ఎంపీగా గెలిపించుకుందామన్నారు. ఈకార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతోపాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement