Monday, January 13, 2025

Godavarikhani – లారీ – కారు ఢీ – తండ్రి కుమారుడు దుర్మ‌ర‌ణం

పెద్ద‌ప‌ల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌నిలో సోమ‌వారం ఉద‌యం ఆగి ఉన్న లారీని, కారు ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప్ర‌తిలో చేర్పించారు. గోదావ‌రిఖ‌ని పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో 11 నెల‌ల బాబు ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు సింగ‌రేణి కార్మికుడు
హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తుండగా గాంధీ నగర్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో సింగరేణి కార్మికుడు సతీష్ అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ అతని 11 నెలల కుమారుడు సాత్విక్ కూడా చనిపోయాడు. ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యులను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement