గోదావరిఖని: కొత్త విధుల్లో చేరుతున్న ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంచుకుంటూ కంపెనీ పురోభివృద్ధికి పాటు పడాలని ఆర్జీ1 జీఎం నారాయణ పేర్కొన్నారు. ఆర్జీ1 ఏరియా పరిధిలో మెడికల్ ఇన్వాలిడేషన్, మృతిచెందిన ఉద్యోగులు 20 మంది డిపెండెంట్స్‌కు కారుణ్య నియామక ఉత్తర్వులను జీఎం నారాయణ స్థానిక కార్యాలయంలో అందించారు. అనంతరం మాట్లాడుతూ 17 మంది మెడికల్ ఇన్వాలిడేషన్, మూడు మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించామని, ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు వివరించారు. మొత్తం 20 మందికి ఏఎల్‌పీలో పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని, రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్‌రావు, ఎస్‌ఓటు- జిఎం త్యాగరాజు, డిజిఎం పర్సనల్ ఎస్.రమెష్, అధికారుల సంఘం రిప్రజెం టివ్ సమ్మయ్య, జిఎం ఆఫీస్ ఇంఛార్జ్ ప్రవీణ్, సారంగపాణి, సేక్యురిటి ఆఫెసర్ వీరారెడ్డి, మళ్లీశ్వరి, అభ్యర్థులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement