Monday, November 18, 2024

Peddapalli: నిరుపేదల దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్, ఆగస్టు 30 (ప్రభ న్యూస్): నిరుపేద ప్రజల దేవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో మండలంలోని నిరుపేదలు 30మంది లబ్ధిదారులకు ఇంటి పట్టా స్థలాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు లేకుండా చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ లతో పాటు ఇంటి పట్టా స్థలాలను అందిస్తున్నారని, అలాగే స్థలం ఉండి గృహం నిర్మించుకోలేని వారికి సైతం గృహలక్ష్మి పథకంలో మూడు లక్షల రూపాయలను అందించి వారి సొంతింటి కలను నిజం చేస్తూ యజమానులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏ గ్రామంలో నిరుపేదలు ఉండకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూములు, గృహ లక్ష్మి పట్టా స్థలాలను పంపిణీ కార్యక్రమాలను చేపట్టి ముందుకు పోతున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టనటువంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే గర్వించదగ్గ స్థాయికి తీసుకు వెళుతున్నారని, భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇదే పాలన కొనసాగించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని, వారి ఆశయ సాధనకు అందరం సహకారం అందించాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంటే కొందరు కావాలని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, 60 సంవత్సరాల కాలంలో చెయ్యని అభివృద్ధిని కేవలం 9 సంవత్సరాలలో ముఖ్యమంత్రి చేసి చూపించారని, గతంలో అభివృద్ధి చెయ్యని నాయకులు ప్రస్తుతం అనేక మాయమాటలతో ప్రజల వద్దకు వస్తున్నారని, వారిని నమ్మి తిరిగి గోస పడవద్దన్నారు. ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా పాలను ముఖ్యమంత్రి చేపడుతున్నారని, అధికార దాహం కోసమే ఇతర పార్టీలు అర్రులు చేస్తున్నారని, వారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇయ్యవద్దని తిరిగి గోసపడే రోజులను మనం చూడవద్దని అన్నారు.

అనంతరం 15 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 15లక్షల ఒక వెయ్యి 7 వందల 40 రూపాయల చెక్కులను అందించారు. ఆడబిడ్డ పెళ్లికి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోవద్దని గొప్ప లక్ష్యంతో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిని ప్రవేశపెట్టి వారి కుటుంబంలో పెద్దన్నగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రిని ఆదరించి అవకాశం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కాసర్ల అనంత రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, వైస్ ఎంపీపీ కోట స్వప్న రామ్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, ఆర్డిఓ మదన్ మోహన్, తాసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఆర్ఐ శ్రీవాణి, జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్, కన్వీనర్ బోయిని రాజమల్లయ్య, సర్పంచులు మోరపల్లి మోహన్ రెడ్డి, ఏరుకొండ రమేష్ గౌడ్, రాజ్ కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఫకీర్ యాదవ్, గట్టు శ్రీనివాస్, శీలం శంకర్, తిప్పారపు దయాకర్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో బీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement