గోదావరిఖని: నూతనంగా ఉద్యోగంలో చేరుతున్న వారు కంపెనీ అభివృద్ధి కోసం పాటు పడాలని ఆర్జీ1 జీఎం కల్వల నారాయణ పేర్కొన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషన్, మృతి చెందిన ఎన్‌సీడబ్ల్యుఏ ఉద్యోగుల 15 మంది డిపెండెంట్స్‌కు కారుణ్య నియామక ఉత్తర్వులు జిఎం కార్యాలయంలో అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఆర్జీ-1 ఏరియాలో 15 మంది డిపెండెంట్లకు నియామక ఉత్తర్వులు ఇచ్చామని, అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ దొరికిందన్నారు. వీరిలో 14 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ కాగా, ఒకరు మరణించిన కార్మికుడికి సంబంధించిందన్నారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్‌లో పోస్టింగ్ పొందగా, ఉద్యోగులు పరిస్థితులకు అనుగుణంగా పని నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటు పడాలన్నారు. సీనియర్ ఉద్యోగుల వద్ద మెళకువలు నేర్చుకొని రక్షణతో కూడిన ఉత్పత్తికి దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబిజికెఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్‌రావు, సిఎంఒఐ జాయింట్ సెక్రటరీ సురేశ్ బాబు, డిజియం పర్సనల్ ఎస్ రమేశ్, జియం ఆఫీస్ ఇంచార్జ్ ప్రవీణ్, డివైపియం సమ్మయ్య, సీనియర్ సెక్యూరిటీ- అధికారి వీరారెడ్డి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement