కరీంనగర్ – యాసంగి ధాన్యం సేకరణ కోసం కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా తొలి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. చెర్లబూత్కూరులో ప్యాక్ అనుబంధంగా నూతన వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 45 రోజుల్లో రాష్ట్రం మెత్తం 6400కు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరిస్తామన్నారు. చెర్లబూత్కూరులో 17వేల క్వింటాళ్ల దాన్యం గతంలో ఈ సెంటర్ ద్వారా కొనుగోలు జరిగిందని, గౌరవ సీఎం గారి క్రుషితో కాళేశ్వరం జలాల ద్వారా ఎస్ఆర్ఎస్పీ 11ఆర్ కింద చెర్ల బూత్కూరుకి సమ్రుద్దిగా నీరుతోపాటు, నిరంతరాయ కరెంట్ వల్ల ఈ యాసంగిలో దాదాపు 20వేల క్వింటాళ్ల పైచీలుకు దిగుబడికి అంచనాతో ప్రతీ గింజ సేకరణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లాలో 351 సెంటర్లను నేడు ప్రారంబిస్తున్నామన్నారు. ఎక్కడ అవసరమున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు మంత్రి. దాదాపు 45 రోజుల్లో పూర్తి కోనుగోళ్లు జరిగేలా జిల్లాలో 4 లక్షల 34వేల క్వింటాళ్ల దాన్యం సేకరణ అంచనాతో కరోనా నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి, దేశం మెత్తంలో ఎక్కడ చూసినా కరోనా సాకుతో ఆర్థిక ఇబ్బందుల్ని చూపెడుతూ కొనుగోళ్లు బంద్ చేస్తుంటే, గౌరవ ముఖ్యమంత్రిగారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొనుగోళ్లు సజావుగా సాగేలా ఆదేశాలిచ్చారన్నారు. రైతులు సైతం ఒకేసారి లారీల లోడుతో కొనుగోలు కేంద్రాల వద్దకు రాకుండా, అధికారులు సూచించిన విదంగా టోకెన్ల వారీగా తేమ 17శాతానికి మించకుండా, తాలు, కచ్చ లేకుండా నాణ్యమైన దాన్యం తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా లబ్దీ పొందాలని తెలియజేశారు. కొనుగోలు జరిగిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బులు జమచేస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వమే గ్యారంటీతో బ్యాంకుల ద్వారా దాదాపు 20వేల కోట్లను సిద్దం చేసిందన్నారు మంత్రి గంగుల, గతంలో మాదిరిగా ఏ రాష్ట్రం ఇవ్వని విదంగా వరిదాన్యం ఏ గ్రేడు రకానికి 1888, బి గ్రేడ్ 1867 రూపాయలు చెల్లిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కరింనగర్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
జిల్లాలో తొలి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్
Advertisement
తాజా వార్తలు
Advertisement