పెద్దపల్లి : నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఉచిత శిక్షణ దోహద పడుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి మండలం పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ, టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గ్రూప్-3, గ్రూప్-4 ఉచిత శిక్షణ తరగతులను ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవడం ద్వారా పోటీ పరీక్షలలో ప్రతిభ చాటుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి, యువత ఉచిత శిక్షణ ద్వారా తమ నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతను ప్రోత్సహించుందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement