రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలంలో భారీగా కురిసిన వర్షానికి ఎల్లారెడ్డి పేట సమీపంలోని రాయపల్లి వాగు పై తాత్కాలికంగా నిర్మించిన రహదారి మళ్ళీ వరద ఉద్రుతికి తెగిపోయింది. దీంతో వీర్ణపల్లి మండలానికి రహదారి సౌకర్యం లేకుండా పోయింది. అలాగే కోరుట్లపెట గ్రామ సమీపంలోని గంగమ్మ గుడివద్ద వాగు ఉదృతంగా ప్రవహించి రోడ్డుపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో వాగు దాటలేని పరిస్థితి నెలకొంది. దీంతో గొల్లపల్లి కోరుట్ల పేటల మధ్య రహదారి సౌకర్యం లేకుండా పోయింది. వరుసగా కురుస్తున్న వర్షాల మూలంగా చెరువులు నిండి పోయాయి. మండలంలో వాగులు వంకలు పొంగపొర్లుతున్నాయి. వర్షాల మూలంగా జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. పంట పొలాలు నీట మునిగి పోవడంతో అనేక గ్రామాలలో రైతులు నష్టపోయారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement