Tuesday, November 19, 2024

నెంబరు ప్లేట్ లేని వాహన‌దారులకు జరిమానాలు తప్పవు : పెద్దపల్లి డీసీపీ రూపేష్

సుల్తానాబాద్ : నంబర్ ప్లేట్ లేని వాహన దారులకు జరిమాణాలు తప్పవని పెద్దపల్లి డీసీపీ రూపేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నంబర్ ప్లేట్ లేని ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన డీసీపీ రూపేష్ మాట్లాడుతూ.. వాహనదారులు విధిగా ముందు వెనక నంబర్ ప్లేట్ కలిగి ఉండాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు హెల్మెట్ ధరించాలని ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అలాగే నంబర్ ప్లేట్ లేకుంటే గుర్తింపు ఉండదని తద్వారా ప్రమాదం జరిగినప్పుడు గుర్తించడం ఇబ్బందికరంగా మారుతుందని ప్రజలందరూ దీనిని గమనించి విధిగా నంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు. ఇకపై తరచూ పోలీసులు దాడులు నిర్వహిస్తారని నంబర్ ప్లేట్లు ధ్రువీకరణ పత్రాలు లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సాదుల సారంగపాణి సిఐ ఇంద్రసేన రెడ్డి ఎస్ఐలు ఉపేందర్ రావు అశోక్ రెడ్డి వినీత లతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement