ఆసరా పింఛన్లతో రాష్ట్రంలోని 46 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కా పూర్ లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ… గత ప్రభుత్వాల హయాంలో రూ.200లు ఉన్న పింఛన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2 వేలకు పెంచారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అందించని విధంగా తెలంగాణలో తమ ప్రభుత్వం అత్యధిక మొత్తంలో పింఛన్లను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఎంపీపీ రమాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement