Tuesday, November 26, 2024

గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాటం : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని, అప్పటివరకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి సర్కారు 2014లో అధికారం చేపట్టిన రోజున గ్యాస్ సిలిండర్ ధర 470 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1105 రూపాయలకు చేరడం ప్రజలపై ఎంత భారం మోపారో తెలిపేందుకు నిదర్శనం అన్నారు. కేంద్రం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్యులు పస్తులు ఉంటున్నారన్నారు.ఈ ధర్నాలో
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తో పాటు తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement